ఇక ఎన్నికల్లో పోటీ చేయను!

ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​

Nov 5, 2024 - 14:07
 0
ఇక ఎన్నికల్లో పోటీ చేయను!

ముంబాయి: మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్​ తన రిటైర్మెంట్​ పై మంగళవారం మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటికే 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని గెలిచానన్నారు. కానీ ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సి వస్తుందన్నారు. నూతన తరం రావాల్సిన అవసరం ఉందన్నారు. తనను 14 సార్లుగా వరుసగా గెలిపిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాను పోటీలో లేకున్నా నిరంతరం వారి సేవలో ఉంటానన్నారు. మరో సంవత్సరంనర పాటు రాజ్యసభకు సభ్యుడుగా కొనసాగుతానని తెలిపారు. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పవార్​ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, మొత్తం 288 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.