విడిపోతే నరికేస్తారు!

ఝార్ఖండ్​ ఎన్నికల సభలో యూపీ సీఎం యోగి

Nov 5, 2024 - 14:54
 0
విడిపోతే నరికేస్తారు!

రాంచీ: బటెంగే తో కటెంగే (విడిపోతే నరికివేస్తారు) అన్న నినాదాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇచ్చారు. ఝార్ఖండ్​ ఎన్నికల సందర్భంగా మంగళవారం కోడెర్మాలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించారు. హేమంత్​ సోరెన్​ ప్రభుత్వం లోని మంత్రి ఆలంగీర్​ ను ఔరంగజేబుతో పోల్చారు. ఝార్ఖండ్​ సంపదను దోచుకుతిన్నాడని మండిపడ్డారు. భారీ మొత్తంలో ఆలం సన్నిహితుడి ఇంట్లో నగదు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. కొంతమంది హిందువులను విడగొట్టి లబ్ధి పొందాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని దుష్టపన్నాగాలు పన్నుతున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను సరిహద్దుల నుంచి రప్పిస్తూ హిందువులపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు. యూపీలో బుల్​ డోజర్లతో మాఫియాను మట్టిలో కలిపేశామన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి దేశాభివృద్ధికి, శాంతికి ప్రయత్నిస్తున్న, దుష్టశక్తుల పీచమణుస్తున్న బీజేపీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.