హేమంత్ కు లభించని బెయిల్ 13న విచారణ
మధ్యంతర బెయిల్ పై శుక్రవారం విచారణ జరిగింది. మే 13కు సుప్రీం వాయిదా వేసింది.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హేమంత్ సోరెన్ కు సుప్రీంలో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణన మే 13కు సుప్రీం వాయిదా వేసింది. పిటిషన్ లో ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సోరెన్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని తెలిపారు. కాగా సోరెన్ తరఫున సుప్రీంలో కేసును కపిల్ సిబల్ వాదిస్తుండడం గమనార్హం.