నాటో జనరల్ సెక్రెటరీగా నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్
The Prime Minister of the Netherlands, Mark Rutte, is the General Secretary of NATO
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బ్రస్సెల్స్ నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన రాయబారుల సమావేశంలో సెక్రెటరీ జనరల్ గా నెదర్లాండ్ ప్రధాని మార్క్ రూట్‌ను నియమించింది. బుధవారం 32 దేశాల కూటమి రాయబారుల సమావేశంలో రూట్ ను ఎన్నుకున్నారు. మార్క్ రూట్ అక్టోబర్ 1న సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జూలై9 నుంచి 11 వరకు వాషింగ్టన్ లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటోదేశాలు నెదర్లాండ్ ప్రధాని రూట్ కు స్వాగతం పలుకనున్నారు.
ప్రపంచంలో పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న కీలక సమయంలో నాటూ జనరల్ సెక్రెటరీగా ఈయనను నియమించడంతో భవిష్యత్ లో ఉత్పన్నం అయ్యే సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.
అంతకుముందు జనరల్ సెక్రెటరీగా ఉన్న స్టోల్టెన్ బర్గ్ మార్క్ రూట్ ఎన్నికను స్వాగతించారు. మార్క్ బలమైన నాయకుడన్నారు. ఆయన నేతృత్వంలో నాటూ మరింత బలపడుతుందన్న నమ్మకం ఉందన్నారు.