అతిషి ఆరోపణలు ఈసీ నోటీసులు
ఎం చెప్పాలని మంత్రి మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: బీజేపీలో చేరడానికి తనకు ఆఫర్ వచ్చిందన్న ఆప్నాయకురాలు, మంత్రి అతిషికి ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ అదుపులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ను కూడా బీజేపీ కొనేందుకు ప్రయత్నించిందని అతిషి పలుమార్లు ఆరోపిస్తూ వస్తోంది. ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిజానిజాలు బయటకు రాకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. తనను కూడా జైలులో వేయనున్నారని అతిషి ఇటీవల మీడియా ముఖంగా వెల్లడించింది. బీజేపీకి భయపడేది లేదని హెచ్చరించింది. రాజకీయ జీవితాన్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని పలువురు తనకు ఆఫర్ చేశారని పేర్కొంది. మాటవినని వారిపై బీజేపీ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ అతిషిని వెంటనే వివరణ కోరింది. అతిషి ఆరోపణలు కాస్త ఆప్పార్టీని మరింత చిక్కుల్లో పడేలా చేస్తున్నాయి. మీడియా ముఖంగా ఆరోపణలు చేసిన అతిషి ఈసీకి ఏం చెప్పాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.