సోదరుల మధ్య పెరిగిన విబేధాలు

మహిమ్​ నుంచి ఉద్దవ్​ అభ్యర్థి పోటీయే కారణం

Oct 24, 2024 - 16:09
 0
సోదరుల మధ్య పెరిగిన విబేధాలు

ఉద్ధవ్​ పై మండిపడ్డ రాజ్​ ఠాక్రే
కుటుంబ సంప్రదాయాన్ని ఉల్లంఘించారని ఆవేదన

ముంబాయి: మహారాష్ట్ర శివసేన (యూబిటీ) ఉద్దవ్​ ఠాక్రే కుటుంబ సంప్రదాయాన్ని ఉల్లంఘించారని మహారాష్ట్ర నవ నిర్మాణ్​ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోదరుల మధ్య బేదాభిప్రాయాలను పక్కన పెట్టి 2019లో ఆదిత్య ఠాక్రే (ఉద్దవ్​ ఠాక్రే కుమారుడు) వర్లీ స్థానం నుంచి పోటీలో దిగగా కుటుంబ సాంప్రదాయాన్ని గౌరవించి తమ అభ్యర్థిని రంగంలోకి దించబోనని ప్రకటించారు. సెంట్రల్ ముంబైలోని మహిమ్ స్థానం నుంచి అమిత్ ఠాక్రే (ఎంఎన్​ఎన్​) నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే  ఉద్దవ్​ ఠాక్రే మహేష్​ సావంత్​ కు టిక్కెట్​ కేటాయించి రాజ్​ ఠాక్రేకు ఝలక్​ ఇచ్చారు. ఈ స్థానం నుంచి శివసేన (షిండే) సిట్టింగ్ ఎమ్మెల్యే సదా శరవంకర్‌ కూడా బరిలో ఉన్నారు. శివసేన (యూబిటీ )65మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ 99, శివసేన షిండే 45, ఎన్సీపీ అజిత్​ వర్గం 38స్థానాలలో అభ్యర్థులను ప్రకటించారు.