రామాలయం గర్భగుడిలో నీరు అవాస్తవం
ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్
లక్నో: అయోధ్య రామ మందిరం గర్భగుడిలో నీరు కారుతుందన్న విషయం వాస్తవం లేదని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పష్టం చేశారు. గర్భగుడిలో నీరు చేరుతుందన్న విషయం విభిన్నంగా వార్తలు వెలువడుతుండడంపై బుధవారం చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడారు. రామ మందిరం గర్భగుడిలో ఒక్కచుక్కనీరు కూడా కారలేదన్నారు. ఆలయ నిర్మాణం పకడ్బందీగా జరిగిందన్నారు. ప్రస్తుతం ఆలయం బయట కొనసాగుతున్న మిగతా పైప్ లైన్ పనుల్లో వర్షం నీరు వస్తోందన్నారు. ఆలయంపైన పడ్డ నీరు ఆవరణలోని పార్కులోకి చేరే చర్యలను చేపట్టామన్నారు. పక్కా ప్రణాళికతో నిర్మాణం చేపట్టామన్నారు. ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. పార్కు ఆవరణలో నీటి నిల్వకు చర్యలు తీసుకున్నామన్నారు. గర్భగుడిలో నీరు చేరడం పూర్తిగా అవాస్తవమని చంపత్ రాయ్ తెలిపారు.