ప్రకృతి, మానవుల కళారూపాలపై రాష్ట్రపతి ముర్మూ హర్షం
The President is delighted with nature and human art forms
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రకృతికి, మానవులకు ఉన్న బంధాలను కళారూపంలో ప్రదర్శించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ న్ లో జరిగిన ప్రదర్శనను ముర్మూ తిలకించారు. అనంతరం ప్రదర్శనలో ఉన్న కళాఖండాలను వీక్షించి కళాకారుల నైపుణ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. వారి సృజనాత్మక చిత్రాలు ప్రకృతితో మానవుల జీవితం మమేకం కావడం పట్ల అభినందించారు. ఈ విధమైన కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దేశ ప్రజలను కోరారు. ఈ ప్రదర్శనలో గిరిజన సమకాలీన, సౌరా, గోండ్, వార్లీ, ఐపాన్ వంటి కళారూపాలను వర్ణించే సహజ రంగులతో చిత్రాలను రూపొందించారు.