క్షమా, కరుణ గొప్ప సందేశాలు
క్రైస్తవులకు ప్రధాని మోదీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: క్షమా, కరుణ అనేవి ఏసుక్రీస్తు ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశాలని క్రీస్తు జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు మానవాళికి ఎంతో నేర్పించాయన్నారు. ఆయన త్యాగం వెలకట్టలేనిదని ప్రధాని పేర్కొన్నారు. కరుణ, క్షమాపణ అనే గుణాలతో మానవునిలో మరింత బలం పెరుగుతుందన్న క్రీస్తు బోధనలు ఆదర్శనీయమని ప్రధాని తెలిపారు.