21వ శతాబ్ధంలో భద్రత మరింత పటిష్ఠం

విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​

Oct 29, 2024 - 16:47
 0
21వ శతాబ్ధంలో భద్రత మరింత పటిష్ఠం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్​ జాతీయ భద్రతా స్థితిని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ అన్నారు. 21వ శతాబ్ధంలో అత్యంత క్లిష్టమైన సవాళ్లను సైతం శాంతియుతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని జై శంకర్​ పునరుద్ఘాటించారు. 
 
మంగళవారం న్యూ ఢిల్లీలో ఆర్మీ కమాండర్​ జాతీయ భద్రతా కాన్ఫరెన్స్​ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రతా అత్యంత ఆవశ్యమన్నారు. ప్రభుత్వ విధానాలు, ఏజెన్సీల వనరులు, దేశీయ నైపుణ్యాలను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు. 
 
సంక్లిష్టమైన భౌగోళిక, రాజకీయ సవాళ్లను సైతం వ్యూహాత్మకంగా, స్థిరంగా తీర్చిదిద్దేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో భారత సైన్యం పరిజ్ఞానం, సామర్థ్యం, అభివృద్ధిని మెరుగుపరిచే విధానంపై వివరించారు. అదే సమయంలో విదేశాలతో నిర్వహించే భద్రతా పరమైన ఉమ్మడి కార్యకలాపాలు, వ్యాయామాలలో పాటించాల్సిన నియమ నిబంధనలు, సమన్వయం, సేవలు, ఏకీకరణ తదితర విషయాలపై ప్రాముఖ్యతను జై శంకర్​ చెప్పారు.