మరాఠా రిజర్వేషన్​ లకు ఆమోదం

పది శాతానికి మహారాష్ర్ట అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం

Feb 20, 2024 - 15:34
 0
మరాఠా రిజర్వేషన్​ లకు ఆమోదం

ముంబై: ఎట్టకేలకు మహారాష్ర్టలో మరాఠా రిజర్వేషన్​ పోరాట సమితి చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. మరాఠాలకు పది శాతం రిజర్వేషన్​ కల్పిస్తూ ఆ రాష్ర్ట అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో మంగళవారం రిజర్వేసన్​ బిల్లును ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దీంతో మరాఠా సామాజికవర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభించనున్నాయి. ఈ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. జరిగింది.

మరాఠా రిజర్వేషన్ల బిల్లును ఏకగ్రీవంగా, సంపూర్ణ మెజారిటీతో ఆమోదించాలని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివార్ ఈ బిల్లుకు అంగీకరించారు.ముసాయిదా బిల్లు ప్రకారం కమిషన్ తన నివేదికను 2024 ఫిబ్రవరి 16న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అనేక ఆటుపోట్లు, ఉద్యమాలు,పోరాటల తరువాత మరాఠాల రిజర్వేషన్​ బిల్లుకు ఆమోదం లభించడంతో మహారాష్​ర్ట మరాఠా రిజర్వేషన్​ పోరాట సమితి సంతోషం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.