అక్నూర్ ఉగ్రదాడిలో ఫాంటన్ మృతి
నివాళులర్పించిన ఆర్మీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అక్నూర్ లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడిలో ఫాంటన్ (బెల్జియ్ మాలినోయిస్) అనే ఆర్మీ శునకం మృతి చెందింది. ఈ శునకం ఆర్మీ ఆపరేషన్ లలో కీలకంగా వ్యవహరిస్తోంది. అనేకసార్లు పేలుడు పదార్థాలు, వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడంలో ఈ శునకం తొలివరుసలో ఉంది. ఈ సందర్భంగా ఫాంటన్ మృతి చెందడంపట్ల సైన్యం నివాళులర్పించింది. ఈ శునకం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఆర్మీకి చెందిన విభాగంలో విధులు నిర్వహించేది. ఈ శునకం 2020, 25 మే న జన్మించింది.