కాంగ్రెస్​–ఆప్​ పొత్తుకు బీటలు

అసెంబ్లీలో ఒంటరిపోరుకు ఆప్​ సిద్ధం సునీతా కేజ్రీవాల్​ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం

Jun 6, 2024 - 22:10
 0
కాంగ్రెస్​–ఆప్​ పొత్తుకు బీటలు

నా తెలంగాణ, ఢిల్లీ: కాంగ్రెస్​–ఆప్​ పొత్తుకు బీటలు వారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేస్తామని ఆప్​ ప్రకటించింది. గురువారం ఆ పార్టీ శాసనసభా నాయకుడు,  ఢిల్లీ కన్వీనర్​ గోపాల్​ రాయ్​ స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల సమావేశంలో కాంగ్రెస్​ నుంచి ముందుగా బయలకు తప్పుకోవాలని పొత్తు ఏ పార్టీతోనూ ఉండకూడదని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. లేకుంటే పార్టీకి మనుగడ లేదన్నారు. లోక్​ సభ ఎన్నికల్లో పొత్తువల్ల ఎలాంటి లాభం లేకపోగా తీవ్రంగా నష్టపోయామన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిపోరే మేలని నిర్ణయించారు. దీంతో ఆప్​ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్​ గానే పోటీ చేస్తుందని కన్వీనర్​ గోపాల్​ రాయ్​ ప్రకటించారు.  కాగా ఈ సమావేశాన్ని సీఎం కేజ్రీవాల్​ సతీమణి సునీతా కేజ్రీవాల్​ అధ్యక్షతన నిర్వహించి తొలి సమావేశంలోనే కాంగ్రెస్​ తో కటీఫ్​ చేయడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.