విద్య అందించకపోవడమే తప్పిదం

ఇప్పటికైనా అభిప్రాయాల్లో మార్పులు రావాలని విజ్ఞప్తి ముస్లిం దేశాలకు పాక్​ మాజీ లెఫ్టినెంట్​ జనరల్​ తలత్​ మసూద్​ సూచన

Apr 11, 2024 - 19:31
 0
విద్య అందించకపోవడమే తప్పిదం

న్యూఢిల్లీ: ముస్లిం దేశాలు విద్యపై దృష్టి సారించకపోవడమే అతిపెద్ద తప్పిదమని పాకిస్థాన్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ తలత్ మసూద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మసూద్ పాకిస్తాన్ వెబ్‌సైట్‌లో గురువారం రంజాన్​ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ముస్లిం దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ముస్లిం దేశాల్లో నాయకులు విద్యకు, మహిళలకు సమప్రాధాన్యతనీయలేక పోతున్నారని అన్నారు. ఇదే ఆ దేశాల వెనుకబాటు, పేదరికం, అభివృద్ధి చెందకపోవడానికి కారణాలన్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలను చూసి ముస్లిం దేశాలు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అఫ్ఘాన్​ తాలిబాన్​ లో విద్యాహక్కును పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని పోస్టులో మసూద్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆయా విషయాలపై స్పందించేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. 

పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఛైర్మన్‌గా కూడా ఉన్న తలత్ మసూద్ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయడాన్ని పలువురు హర్షం వ్యక్తం చేస్తుంటే పలువురు వ్యతిరేకిస్తున్నారు.

2014కి ముందు.. తరువాత భారత్​ శక్తి..

గత పదేళ్ల క్రితం 2014 క్రితం భారత్​ పరిస్థితుల్లో కూడా పలు ప్రాంతాల్లో పెద్దగా తేడా ఏం లేదు. 2014 అనంతరం పరిస్థితుల్లో మార్పు చేర్పులు చేసుకొని అత్యంత అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం విశేషం. అదే సమయంలో నారీశక్తికి అత్యధిక ప్రాధాన్యత లభిస్తుండడం తెలిసిందే. నిరుపేదల్లో ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, ఆదివాసీలకు ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాలు సమప్రాధాన్యతకు అవకాశాలు కల్పిస్తుండడం విశేషం.