పాక్ లో ఛాంపియన్స్ ట్రోఫీ శనివారం ఐసీసీ తుది నిర్ణయం
The Champions Trophy in Pakistan will be the final decision of the ICC on Saturday
పాక్ లో ఆడమోమని తేల్చి చెప్పిన భారత్
హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలని భారత్ సూచన
భారత్ ఆడకుంటే సీరిస్ ను చుట్టుముట్టనున్న ఆర్థిక కష్టాలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: వచ్చే యేడాది పాక్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై శనివారం ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఐసీసీ దుబాయ్ లో నిర్వహించనున్న సమావేశానికి అన్ని బోర్డులను ఆహ్వానించినట్లు వెల్లడించాయి. గతంలోనూ నిర్వహించిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సమావేశాన్ని శనివారానికి వాయిదా వేశారు.
భద్రతా కారణాల రీత్యా బీసీసీఐ (భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు) భారత ఆటగాళ్లను పాక్ కు పంపేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో హై బ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహిస్తారని భావిస్తున్నారు. దీనిపైనే నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది మరో 24 గంటల్లో తేలిపోనుంది. మరోవైపు భారత్ ఆటగాళ్లను లాహోర్ కు పంపాలని పీసీబీ కోరింది. హైబ్రిడ్ మోడల్ కు నిరాకరించింది. ట్రోఫీ నిర్వహణకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. గతంలోనూ పాక్ లో నిర్వహించిన టోర్నీల్లో ఏకంగా క్రికెటర్లపై దాడులకు కూడా ప్రయత్నించిన సందర్భాలున్నాయి. భద్రతా దళాలు రంగంలోకి దిగి ఏకంగా అక్కడి నుంచే ఆటగాళ్లను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ఈ నేపథ్యంలో భారత్ తమ ఆటగాళ్లను పంపబోమని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. మరోవైపు భారత్ ఆడితే గానీ నాలుగు రాళ్లు గిట్టుబాటు కానీ స్థితిలో టోర్నీ నిర్వహణపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.
ఒకవేళ భారత్ ను కాదని ఐసీసీ, పీసీబీలు టోర్నీ నిర్వహించేందుకు ముందుకు వెళ్లినా ఆటగాళ్ల ప్రయాణాలకు కూడా ఆర్థికంగా గిట్టుబాటు కాని పరిస్థితులున్నాయి.