జపాన్ పౌరులే లక్ష్యంగా బాంబు దాడి డ్రైవర్, గార్డులు మృతి
పాక్ లో జపాన్ పౌరులే లక్ష్యంగా శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో జపాన్ పౌరులు తృటిలో తప్పించుకోగా డ్రైవర్, సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు.
ఇస్లామాబాద్: పాక్ లో జపాన్ పౌరులే లక్ష్యంగా శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో జపాన్ పౌరులు తృటిలో తప్పించుకోగా డ్రైవర్, సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాహనంలో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వెంటనే వారిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. విదేశీయులే లక్ష్యంగా పాక్ లోని ఉగ్రమూకలు తెగబడుతున్నాయి. గతంలో చైనా జాతీయులపై ఇదే విధంగా దాడికి పాల్పడి ఆ దేశ ఇంజనీర్లను పొట్టన బెట్టుకున్నాయి.
మరోవైపు పాక్ కు ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సహాయం చేసేందుకు అంగీకరించింది. అయితే ఇదే సమయంలో పలుకీలక షరతులను విధించింది. ఈ విషయాన్ని పాక్ మంత్రి వెల్లడించారు. త్వరలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఐఎంఎఫ్ తో భేటీ కానున్నట్లు వివరించారు. కాగా షరతులు ఏంటన్న విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించక పోవడం గమనార్హం.