సమర్థ్​ తో ఆరు లక్షల మంది మహిళలకు శిక్షణ

Training six lakh women with Samarth

Nov 29, 2024 - 17:35
 0
సమర్థ్​ తో ఆరు లక్షల మంది మహిళలకు శిక్షణ

కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమర్థ్​ పథకం కింద ఆరు లక్షల మంది మహిళా లబ్ధిదారులు శిక్షణ పొందారని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా అన్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీలో టెక్స్​ టైల్స్​ పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. టెక్స్​ టైల్స్​ పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందడం హర్షణీయమన్నారు. మరింత వృద్ధి చోటు చేసుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ శిక్షణ పొందిన వారిలో అత్యధికంగా 88 శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. సమాజంలో అన్ని వర్గాలను అభివృద్ధిలో భాగం చేయాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. మహిళా సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.