నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జీడీపీ వృద్ధి ఎఫ్ వై 2025లో 5.4 శాతానికి తగ్గింది. జాతీయ గణాంకాల కార్యాలయం ( నేషనల్ స్టాటిస్టిక్స్ ఫర్ ఆఫీస్) శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. ఏడు త్రైమాసికాల్లో ఇదే అతి తక్కువ వృద్ధిగా నమోదైంది. ఎఫ్ వై 24లో ఈ వృద్ధి 8.1గా ఉండగా, 2023లో 4.3 శాతం.
రంగాల పనితీరు మిశ్రమ వృద్ధి కనిపించింది. రెండవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి 3.5 శాతంగా ఉంది, ఇది మునుపటి త్రైమాసికంలో 2 శాతం, వార్షికంగా 1.7 శాతం రికవరీని చూపిస్తుంది. అయితే మైనింగ్ రంగంలో వృద్ధి -0.1శాతం. క్రితం త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 11.1శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది 7.2శాతం.
ఈ త్రైమాసికంలో తయారీ రంగం వృద్ధి 2.2శాతంగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 14.3శాతంగా ఉంది. ఎలక్ట్రిక్ సిటీ విభాగంలో వృద్ధి 3.3శాతం, గతేడాది 10.5శాతంగా ఉంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా రంగాల్లో ఆర్థిక వృద్ధి 6 శాతంగా మెరుగుపడింది. ఆర్థిక, రియల్ ఎస్టేట్, సేవలు 6.7శాతం వృద్ధి చెందాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇతర సేవలు గత సంవత్సరం 7.7శాతం నుంచి 9.2శాతానికి మెరుగుపడ్డాయి.
ప్రధాన దేశాలలో భారతదేశం ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. జీడీపీ వృద్ధి నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై-–సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 4.6శాతం, జపాన్ జీడీపీ 0.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. భారత్ వృద్ధి 5.4 శాతంగా ఉంది.