సోపోర్​ లో ఎన్​ కౌంటర్​ ఉగ్రవాది హతం

ఇద్దరి కోసం కొనసాగుతున్న సెర్చింగ్​ ఆపరేషన్​

Aug 24, 2024 - 16:21
 0
సోపోర్​ లో ఎన్​ కౌంటర్​ ఉగ్రవాది హతం
శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ సోపోర్​ జిల్లాలో ఉగ్రవాదులు భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆ ప్రాంతంలో మరో ఇద్దరి కోసం భద్రతా దళాలు సెర్చ్​ ఆపరేషన్​ ను కొనసాగిస్తున్నాయి. శనివారం ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న సెర్చింగ్​ ఆపరేషన్ లో ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. పోలీసులు, 32 రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్ లో సెర్చింగ్​ ఆపరేషన్​ ను చేపట్టింది. చేపట్టింది. శుక్రవారం అర్థరాత్రి భద్రతా దళాలు పాక్​ ఆక్రమిత కశ్మీర్​ వాసి లష్కరే తోయిబా ఉగ్రవాది జహీర్​ హుస్సేన్​ షాను అరెస్టు చేశాయి. పూంచ్​ లో అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. 
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్​ లో ఇప్పటికే 300 కంపెనీల పారామిలటరీ బలగాలను కేంద్రం మోహరించింది. 
 
శ్రీనగర్, హంద్వారా, గండేర్బల్, బుద్గాం, కుప్వారా, బారాముల్లా, బందిపోరా, అనంత్​ నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపొరా, కుల్గాంలో ఈ కంపెనీలను మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.