అమేథీ, రాయ్​ బరేలీ రాహుల్​, ప్రియాంకలే అభ్యర్థులు?

హస్తం పార్టీ సమావేశంలో నిర్ణయం

Apr 24, 2024 - 15:18
 0
అమేథీ, రాయ్​ బరేలీ రాహుల్​, ప్రియాంకలే అభ్యర్థులు?

న్యూఢిల్లీ: రాహుల్​ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్​ బరేలీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. బుధవారం కాంగ్రెస్​ అధిష్టానం నిర్వహించిన సమావేశంలో ఇద్దరి స్థానాలను ఖరారు చేశారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రియాంక పోటీ చేస్తే ఆమె తొలిసారిగా పోటీ చేసినట్లవుతుంది. కాగా అమేథీ, రాయ్​ బరేలీలో మే 3, మే 20వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోనియాగాంధీ కూడా వీరిద్దరి పోటీకి ఓకే చెప్పారు. గతంలో ఈ స్థానాలను పోటీకి రాహుల్​, ప్రియాంకలు అన్యమనస్కంగా ఉన్నా, ప్రస్తుతం వారు కూడా పోటీకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రంగంలో ఉండగా, రాయ్​ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. రెండో విడత ఎన్నికల అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటు రాహుల్​, అటు ప్రియాంకలను మట్టి కరిపించేందుకు బీజేపీ బలమైన అభ్యర్థులనే రంగంలోకి దింపడంతో కాంగ్రెస్​ కు ఓటమి ఖాయమనే వాదన వినిపిస్తోంది.