ఇంటలిజెన్స్ ఆరాలో నివ్వెరపోయే విషయాలు
దాడులపై కేంద్రానికి సీఎం శర్మ ఫిర్యాదు
ప్రణాళిక ప్రకారమే దాడులకు వ్యూహరచన
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అసోంలోని హిందూవులు, ఆదివాసీలపై దాడులు భారీగా పెరిగాయి.ఈ అంశాన్ని పలుమార్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు.
రంగంలోకి దిగిన ఇంటలిజెన్స్ వర్గాలు ఈ దాడులపై ఆరా తీయగా పలు ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకొచ్చాయి. హిందువులపై దాడులకు ముస్లింలను రెచ్చగొడుతున్నట్లు, వారికి భారీ ఎత్తున ఏదో ఒక రూపంలో నిధులను సమకూరుస్తున్నట్లు గుర్తించాయి. గత మూడు నాలుగు నెలల్లోనే ఈ రాష్ర్టంలో హిందూ సమాజంపై 25కు పైగా దాడి ఘటనలు జరగడాన్ని ఇంటలిజెన్స్ పసిగట్టింది. ఈ దాడులన్నీంటి వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలను వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం కూడా నిఘా వేసి పర్యవేక్షణకు దాడుల కట్టడికి నడుం బిగించింది.
అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, భూ కబ్జాలు, పోలీసులపై దాడులు, లవ్ జిహాద్, ఆర్థిక, గ్యాంగ్ వార్ లు ఇలాంటి అనేక దాడుల్లో హిందూ సమాజాన్ని ఈ ఉగ్రభావాలు కలిగిన వారు దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఎప్పుడెప్పుడు దాడులు?..
మే3న గోల్ పరా తంగబారి గ్రామంలో హిందూ యువతి కిడ్నాప్, సామూహిక అత్యాచారం. ఈ కేసులో ధన్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.
మే 14న బార్ జిల్లా కయాకుచిలో హిందువులపై దాడి జరిగింది. ఈ దాడికి జవోహర్ ఖాన్ నేతృత్వం వహించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
మే 23మే లఖింపూర్ లోని ఖేల్మతి పోలీస్ స్టేషన్ పై దాడి.
జూన్ 7 కోక్రాజార్ జిల్లా ఫకీరా గ్రామ్ లోని హిందువులపై ల్యాండ్ మాఫియా (ఇస్లామిక్) దాడులకు దిగింది. ఈ దాడిలో అనేకమంది హిందువులకు గాయాలయ్యాయి.
జూన్ 22 మజ్బత్ లోని హిందూ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం కేసులో అలీ, అహ్మద్, హఫీజుల్, మొహిదుల్, ముస్తాక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 24 ధేకియాజులిలో ఆదివాసీ యువతిని కిడ్నాప్ చేసిన షాహిదుల్ ఇస్లామ్ లైంగికంగా వేధించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 26 గోలక్ గంజ్ ను హిందువులు విడిచి వెళ్లాలని ఇస్లామిస్టులు దాడులకు పాల్పడ్డారు.
జూన్ 27 సోనిత్‌పూర్ జిల్లాలో తెలమరాలో హిందూ యువతి లైంగిక వేధింపులకు గురైంది. ఈ కేసులో అనరుల్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
జూన్ 28న ధేకియాజులిలోని ఎల్ ఎకేడీ కాలేజీ బాలికల వసతి గృహంలోకి ఒక ముస్లిం యువకుడు చొరబడి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలికలు పెద్ద పెట్టున కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు.
జూన్ 29న బైహటాలోని వోమోల్ హతిలో హిందూ యువతిని అబుల్ కలాం కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు ఆమెను కాపాడి నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
జూన్ 29న లవ్ జిహాదీ కేసు, జూన్ 30న బరేటాలో హిందూ స్మశానవాటికపై దాడులు, జూలై 1న మహిళపై లైంగిక వేధింపులు బాబుల్ అలీ అరెస్ట్, జూలై 6న రంగపోరాలో ఆదివాసీ బాలిక కిడ్నాప్ అత్యాచార యత్నం దిల్దార్ హుస్సేన్ అరెస్టు, జూలై 13న గోల్ పరా ప్రాంతంలో లైంగిక దాడి, జూలై20న మంగళ్ దోయ్ హిందూ యువతి కిడ్నాప్ సజెల్ అలీ అరెస్టు. జూలై 24న డింగ్ గ్రామంలో హిందువులపై దాడులు అత్యాచారాలు స్ప్రే గ్యాంగ్ అరెస్ట్. జూలై 28న హజోలో బాలికపై లైంగిక వేధింపులు ఇబ్రహీం అలీ అరెస్ట్. ఆగస్ట్ 2న బోర్సోలాలోని పోలీసులపై దాడులు. ఆగస్ట్ 14న అజారాలో హిందూ యువకుడు కిడ్నాప్ దాడి. పరమ్ అలీ అరెస్ట్. ఆగస్ట్ 17 దంగర్ కొచ్చిలో గ్రామస్థులపై దాడులు. సిల్చార్ లోని అసోం విశ్వవిద్యాలయంలో హిందూ బాలికపై లైంగిక వేధింపులు జమాన్ ఫరూక్ అరెస్ట్. ఆగస్ట్19న బూరే ఘాట్ లో హిందూ యువతి కిడ్నాప్ అబ్దుల్ హుస్సేన్, సూరల్ అలీ, జూలుద్ హుస్సేన్ ల అరెస్ట్.
ఆగస్ట్ 22న నాగావ్ జిల్లాలో హిందూ యువతి కిడ్నాప్ జునైదుల్, తఫాజుల్ హుస్సేన్ ల అరెస్ట్, ఆగస్ట్ 23న తేజ్పూర్ లో యువతులకు వేధింపులు షారూక్, మీరాజ్అలీల అరెస్ట్.
మే నుంచి ఇంటలిజెన్స్ వర్గాలు అసోం వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ లలో జరిగిన కేసులపై ఆరా తీయగా నివ్వేరపోయే ఈ విషయాలు వెలుగుచూశాయి. అంతర్గతంగా ఆరా తీయగా ఈ దాడులన్నింటి వెనుక అసోంలోని మదర్సాల పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం ఇక్కడే హిందూవులపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.