ఖాట్మాండూ: నేపాల్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. శనివారం 24 భారతీయుల మృతదేహాలను తీసుకొని ఐఏఎఫ్ ప్రత్యేక విమానం భారత్ కు బయలుదేరింది. మహారాష్ర్టకు మృతదేహలను తీసుకురానున్నారు.
శుక్రవారం పోఖ్రా నుంచి ఖాట్మాండూ వెళుతుండగా తనుజాహ్ ప్రాంతంలో మర్స్యాంగ్డి నదిలో బస్సు పడిపోయింది. 20 మంది వరకు గాయాలుకావడంతో త్రిభువన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మహారాష్ర్టలోని జల్గావ్ జిల్లా భూసాల్ గ్రామవాసులున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటన భారత ప్రభుత్వం స్పందించి ఐఏఎఫ్ విమానాన్ని త్రిభువన్ ఏయిర్ పోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యల కోసం ప్రత్యేక విమానాన్ని అక్కడికి పంపారు.
ఈ బస్సు యూపీలోని గోరఖ్ పూర్ కు చెందినది.