సీఎంపై కేసు నమోదు!
ముడా భూ కోణంలో సిద్ధరామయ్య హస్తం?
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ముడా భూ ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు కానుంది. భూ ఆరోపణలపై పలు విషయాలను పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కేసు నమోదుకు శనివారం అధికారికంగా అనుమతించారు. సిద్ధరామయ్యతోపాటు మరో 9మందిపై కూడా సామాజిక కార్యకర్త, న్యాయవాది అబ్రహం, ప్రదీప్, స్నేహమొయి కృష్ణ లు ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ అనుమతితో వీరందరిపై కేసు నమోదు చేసి విచారణకు అనుమతించారు. గతంలో భూ కుంభకోణంలో తన కుటుంబ సభ్యులు, సతీమణి పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారు. అనంతరం ఇవే భూములను ముడాకు కట్టబెట్టి వారి వద్ద నుంచి మైసూర్ లోని అత్యధిక విలువైన స్థలాలను చేజిక్కించుకున్నారు.