ఉగ్రవాది అరెస్టు.. భారీ ఆయుధ డంప్​ స్వాధీనం

Terrorist arrested. Huge arms dump seized

Oct 30, 2024 - 13:06
 0
ఉగ్రవాది అరెస్టు.. భారీ ఆయుధ డంప్​ స్వాధీనం

శ్రీనగర్​: అక్నూర్​ ఘటనపై విచారణ చేపట్టిన భద్రతా బలగాలు పూల్వామాలో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. అతని వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధ డంప్​ ను స్వాధీనం చేసుకున్నాయి. మంగళవారం అర్థరాత్రి ఉగ్రవాదికి సంబంధించిన సమాచారం అందుకున్న భద్రతాబలగాలు గుట్టుచప్పుడు కాకుండా దాడి చేసి అతన్ని అరెస్టు చేసి భారీ ఎత్తున ఆయుధాల డంప్​ ను స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసానికి తెరతీసేందుకే ఈ ఆయుధ డంప్​ ను సిద్ధం చేశారని అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ఉగ్రవాది వద్ద పాక్​ లో తయారైన మందులు, డ్రై ఫ్రూట్స్​, ఆహార పదార్థాలు లభించాయి. 

స్వాధీనం చేసుకున్న ఆయుధాలు..
ఎం–4 రైఫిల్​–1, ఎం–4 మ్యాగజైన్​ 3, ఎకే 47 రైఫిల్​ 2, ఎకే మ్యాగజైన్​ 8, పిస్టల్​ 1, 9ఎంఎం పిస్టల్​ రౌండ్​ 20, 7.62 ఎంఎం రౌండ్​ 77, 5.56 ఎంఎం రౌండ్​ 129, హ్యాండ్​ గ్రెనేడ్​ 10, సోలార్​ ప్యానెల్​ 1, పవర్​ బ్యాంక్​ 1, బైనాక్యూలర్​ 1, డిజిటల్ కాసియో వాచ్- 1, ఎరుపు రంగు నోట్‌బుక్- 1, సైలెన్సర్- 1, బట్టలు, సాక్స్, బూట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.