లక్నోలో బీజేపీ కార్యకర్తలపై దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు

నకిలీ ఓటర్లు 42 మంది ని అరెస్టు

May 7, 2024 - 13:02
 0
లక్నోలో బీజేపీ కార్యకర్తలపై దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు

లక్నో: లక్నో మెయిన్​ పురిలో ఓటింగ్​ సందర్భంగా బీజేపీ, ఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. మరో ఘటనలో నకిలీ ఓటర్లు 42 మంది ని అరెస్టు చేశారు. ఓటు వేయకముందే పట్టుబడ్డారు. ఈ ఘటన రామ్​ గఢ్​, నార్త్​ సౌత్​ , రసూల్​ పూరా పోలీస్​ స్టేషన్ల పరిధిలో అరెస్టు చేశారు. కాగా రాళ్ల దాడిలో బీజేపీ కార్యకర్త మనోజ్ చౌహాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ కుమారుడు సుమిత్ ప్రతాప్ సింగ్ పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. 

మైన్‌పురిలోని కిష్ని అసెంబ్లీ నియోజకవర్గం తేజ్‌గంజ్‌లోని బూత్ నంబర్ 176 వద్ద గొడవ జరిగింది. బీజేపీ అభ్యర్థి ఠాకూర్ జైవీర్ సింగ్‌బ్ కుమారుడు సుమిత్ ప్రతాప్ సింగ్ ఇక్కడికి చేరుకోగా, దాడులు జరిగియి. రాళ్లదాడిలో అలజడి నెలకొని తొక్కిసలాట జరిగింది. రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ ఏజెంట్ సుధేష్ కుమార్, చీఫ్ రిప్రజెంటేటివ్ కరణ్ బహదూర్ సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి.