భారత్​ కు వంద టన్నుల బంగారం!

One hundred tons of gold for India!

Oct 30, 2024 - 12:35
 0
భారత్​ కు వంద టన్నుల బంగారం!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ ఆపద సమయాల్లో బ్రిటన్​​ కు తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపిస్తూ భారత్​ కు తీసుకువస్తుంది. ప్రస్తుతం భారత్​ వద్ద 510 టన్నుల బంగారం నిల్వలకు చేరాయి. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోళ్ల భారీ డిమాండ్​ ఉండడంతో మరో 100 టన్నుల బంగారాన్ని బ్రిటన్​ నుంచి భారత్​ తీసుకువచ్చింది. సెప్టెంబర్​ చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 855 టన్నుల బంగారం ఉండగా, ప్రస్తుతం 510.5 టన్నుల బంగారం ఉంది. 2022లో కూడా భారత్​ 214 టన్నుల బంగారాన్ని తీసుకువచ్చింది. ఈ యేడాది మేలో 102 టన్నుల బంగారాన్ని వెనక్కి రప్పించింది. ప్రస్తుతం 324 టన్నుల బంగారం నిల్వలు బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​, బ్యాంక్​ ఫర్​ ఇంటర్నేషనల్​ లో ఉన్నాయి.  

విదేశీ మారకద్రవ్య నిల్వల్లో ఎగుడుదిగుడులు చోటు చేసుకుంటూంటాయి. ఈ నేపథ్యంలో కొంతమేర ప్రతీదేశానికి ఆర్థిక పరంగా లాభనష్టాలు చేకూరుతుంటాయి. ఇవి కరెన్సీ ద్వారా సాధ్యం కానందునే బంగారం నిల్వలను ఈ లోటుభర్తీని పూర్తి చేసుకుంటుంటారు. అందుకే బంగారాన్ని తాకట్టుపెడుతుంటారు. ప్రస్తుతం భారత ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉండడం, మార్కెట్లు ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధిస్తుండడంతో భారత్​ బ్రిటన్​ లో తాకట్టుపెట్టిన బంగారాన్ని క్రమేణా విడిపించుకుంటోంది.