పీఎం ఆవాస్ మరో 2 కోట్ల ఇళ్లకు ఆమోదం
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. బుధవారం విలేఖరుల సమావేశంలో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ప్రతి పేదవారికి పక్కా ఇళ్లు అందించాలనేదే తమ అభిమతమన్నారు. ఇప్పటికే 2.95 కోట్ల ఇళ్లను అందజేశామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ కింద 38 లక్షల ఇళ్లను కేటాయించామని, వీటికి పదివేల ఆరువందల కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మహిళా సాధికారత గురించి చౌహాన్ మాట్లాడుతూ, అజీవిక మిషన్‌తో 10 కోట్ల మందికి పైగా మహిళలు అనుబంధం కలిగి ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు 1 కోటి 15 లక్షల మంది మహిళలు లఖపతి దీదీలుగా మారారని శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు.