నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్రం, రాష్ట్రానికి మధ్య గవర్నర్లు వారధి పాత్రను పోషిస్తూనే రాజ్యాంగ పరిధిలో ప్రజా సంక్షేమంలో కీలకపాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అధ్యక్షతన తొలిసారిగా రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్లు సమావేశమయయారు. ఈ సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి గవర్నర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
అణగారిన, గిరిజన ప్రజలను కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యపాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాలు, సరిహద్దు, అభివృద్ధికి కీలక ప్రాధాన్యతనిస్తుందన్నారు. సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు మనమంతా పాటుపడాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు.