కథువాలో ఉగ్ర సహాయకులు అరెస్ట్​

కూపీ లాగుతున్న భద్రతా బలగాలు, పోలీసులు

Jul 25, 2024 - 15:11
 0
కథువాలో ఉగ్ర సహాయకులు అరెస్ట్​

శ్రీనగర్​: కథువాలో ఇద్దరు జైష్​ ఎ మహ్మద్​ కు చెందిన ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని భద్రతా బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. గురువారం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు పలు విషయాలపై కూపీ లాగుతున్నారు. ఆర్మీ కాన్వాయ్​ పై దాడిలో వీరి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరు స్థానిక సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేస్తున్నారు. రాజౌరి, పూంచ్​, దోడా, కథువా, రియాసీ, ఉధంపూర్​ లలో 40 మంది ఉగ్రవాద సహాయకులను గుర్తించారు. ఇందులో పలువురిని అదుపులోకి తీసుకోగా పలువురి పరారీలో ఉన్నారు.