నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జర్మనీ – భారత్ ల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. శుక్రవారం న్యూ ఢిల్లీలోని 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్నన్ బిజినెస్ కార్యక్రమంలో ఇరుదేశాల ప్రతినిధుల స్థాయి చర్చలు, సమావేశం ప్రధాని మోదీ, ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా పలు ఎమ్మెల్యేలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
సమాచార మార్పిడిపై ఇరుదేశాలు అంగీకరించాయి. ఆవిష్కరణలు, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణ, ఉపాధి, కార్మిక, పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.
కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, స్వచ్ఛమైన ఇంధనం వంటి రంగాలలో ఇరుదేశాల ఒప్పందాలతో మరింత అభివృద్ధి సాధ్యమైన అభిప్రాయాన్ని ఇరుదేశాలు వ్యక్తం చేశాయి.
ఇండోపసిఫిక్ ప్రాంతంలో నావిగేషన్ స్వేచ్ఛ, చట్ట పాలన, నియమనిబంధనలలో మరింత స్పష్టత అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ ఒప్సందాలపై సంతకాలు చేశారు.