మోదీ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యభూమిక
నిబద్ధతతో పనిచేస్తున్నాం
కార్మికుల సంక్షేమం కోసం సీఐఎల్ ఆపన్నహస్తం
కోల్ కతా: ప్రధాని మోదీ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా వికసిత, ఆత్మనిర్భర్ భారత్ లో కోల్ ఇండియా అతిముఖ్య భూమిక నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. 1947లో వందేళ్ల వికసిత భారత్ విజన్‌కు సంస్థ కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. ఆదివారం కోల్ ఇండియా (సీఐఎల్) 50వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కోల్ కతాలోని బిస్వా బానా కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కోల్ ఇండియా 50 యేళ్ల వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు. ఈ ఉత్సవాలు పూర్తి ఒక సంవత్సరం పాటు నిర్వహించడం జరిగింది. ఈ సమయంలో ఉత్పత్తి, ఎగుమతులు, కార్మికుల క్షేమం తదితరాలపై పూర్తి నిబద్ధతతో పనిచేద్దామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణతో సంస్థ బాధ్యత మరింత పెరిగింది. భారత వృద్ధిలో ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్న సంస్థ.
కుంభకోణాల నుంచి పారదర్శక విధానాల వరకూ..
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి.. కోల్ ఇండియా 214 మోదీ అధికారం చేపట్టాక అత్యంత పారదర్శక విధానాలతో ముందుకు వెళుతున్నారు. అంతకు ముందు ప్రభుత్వాలలో బొగ్గు కుంభకోణాలను చూశారు. సుప్రీం హెచ్చరించినా వారి తీరులో మార్పు. కానీ తమ ప్రభుత్వం పారదర్శక విధానంతో సీఐఎల్ దినదిన ప్రవర్థమానంగా వృద్ధిని సాధించింది.
కార్మికుల కష్టం వల్లే వృద్ధి సాధ్యం..
వృద్ధి వెనుక కార్మికుల కష్టం దాగి ఉంది. కార్మికుల సంక్షేమ ధ్యేయంగా సీఐఎల్ అనేక కార్యక్రమాలను చేపట్టింది. కార్మికుల భద్రత కోసం నూతన, అత్యాధునిక పద్దతులను అవలంబిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో వారికి 2023–24కు సంబంధించిన ఇన్‌సెంటీవ్‌లను ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తీపికబురు తెలిపారు. కార్మికుల కుటుంబ భద్రత కోసం విద్య, వైద్యం, ఉద్యోగ భద్రత ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఐఎల్ నిర్వహించడం జరిగింది. మోదీ ప్రభుత్వానికి దేశాభివృద్ధికి కారణమైన వారి అభివృద్ధి, ఆరోగ్య సంక్షేమం కూడా ఎంతో ముఖ్యమని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
సమస్యలను పరిష్కరిస్తూ వృద్ధి దిశగా..
ఉత్పత్తి, ఎగుమతుల కోసం సంస్థ ముందున్న అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రస్తుత వృద్ధిని సాధించే దిశగా పయనిస్తున్నామని మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో మరింత వృద్ధిని సాధిస్తామన్నా ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు, ధరలు, మార్కెటింగ్, పోటీ ఇలా అనేక సమస్యలను సీఐఎల్ పరిష్కరిస్తూ వృద్దిని నమోదు చేసే దిశగా ముందుకు సాగుతుంది. ఇదంతా పారదర్శక విధానం వల్లే సాధ్యపడ.
ఉత్పత్తి, సరఫరాలో ప్రపంచంతో పోటీ..
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సమయాని కంటే ముందే బొగ్గును సరఫరా చేస్తూ ముందువరుసలో నిలుస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ బొగ్గు సరఫరాలో ప్రపంచంతో పోటీ పడనుందని చెప్పారు. ఎనర్జీ ఏకో సిస్టమ్‌కు కేంద్ర బిందువుగా సీఐఎల్ నిలవడం గర్వకారణమని. రీన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి)రంగంలో భారత్ భారీ పెట్టుబడులను పెట్టింది. ఈ పెట్టుబడుల వల్ల కోల్, థర్మల్ రంగాలు పనిచేస్తూ వృద్ధిని సాధించడం హర్షణీయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానాలను బొగ్గు ఉత్పత్తి రంగంలో వృద్దిని సాధిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ మరింత శక్తివంతంగా అవతరిస్తుంది.
సంస్థ లక్ష్యాలను వివరించిన సీఐఎల్ చైర్మన్ ప్రసాద్..
సీఐఎల్ చైర్మన్ పి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ సంస్థ భవిష్యత్ గురించి వివరించారు. భద్రత, సుస్థిరత, పర్యావరణం, ఉత్పత్తి, ఎగుమతులపై సంస్థ లక్ష్యాలను వివరించారు. 96 శాతం బొగ్గు ఉత్పత్తి ఓపెన్ కాస్ట్ మైనింగ్ నుండి వస్తుండగా, 4 శాతం భూగర్భ గనుల నుంచి లభిస్తున్నాయి. సీఐఎల్ స్వయం ప్రతిపత్తి సంస్థలతో ఇంధన రంగంలో వృద్ధికి కృషి చేస్తోంది. భారత్ స్థిరమైన, సురక్షితమైన ఇంధన భవిష్యత్ లక్ష్యంతో తమ ప్రణాళికల ద్వారా ముందుకు వెళతామని ప్రసాద్ తెలిపారు.