పాఠశాలకు దారేది? తనిఖీకి వచ్చి ఖంగుతున్న ఎంపీడీవో రేవతి

Daredi to school? MPDO Revati is coming for inspection.

Jun 13, 2024 - 13:02
 0
పాఠశాలకు దారేది? తనిఖీకి వచ్చి ఖంగుతున్న ఎంపీడీవో రేవతి

నా తెలంగాణ, డోర్నకల్​: ఆ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించారు. కానీ వెళ్ళే దారి మాత్రం లేదు! ఆశ్చర్యం వేస్తోందా? వివరాలు తెలుసుకోండి.. మరిపెడ మండంలోని గుండెపుడి గ్రామం ఊరుపక్క తండా ప్రాథమిక పాఠశాలకు గురువారం ఎంపీడీవో జి. రేవతి తనిఖీ కోసం వచ్చారు. పాఠశాలకు దారి లేకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులుండగా ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. పాఠశాల పక్కనే ఇతరుల భూమి ఉండడం వారు దాన్ని నిర్మించుకోవడంతో పాఠశాలకు పూర్తిగా దారి మూసుకుపోవడం గమనార్హం. స్థానికుల సహాయంతో ఈ పాఠశాల స్థల సేకరణ, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనను చేశారు. చివరకు పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు కూడా. పాఠశాల కోసం 12 అడుగుల రోడ్డును వదిలి పెట్టాలని ప్రహారీ గోడ పగులగొట్టి గేట్లు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో పంచాయితీ కార్యదర్శిని ఆదేశించినా ఆ పనులు చేపట్టలేదు. దీంతో ఎంపీడీవో తనిఖీకి వచ్చి దారి లేకపోవడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.