రూపాయి రాకడ.. పోకడ.. రాష్ట్రాలకు కేటాయింపులు

Rupee inflow.. trend.. allocations to states

Jul 23, 2024 - 18:49
 0
రూపాయి రాకడ.. పోకడ.. రాష్ట్రాలకు కేటాయింపులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25 బడ్జెట్​ లో 63 శాతం పన్నుల ద్వారా రాబడి చేకూరనుండగా, 27 శాతం అప్పుల ద్వారా సమీకరించనుంది.

పన్ను వసూళ్ల ద్వారా ఆదాయం..

ఆదాయపు పన్ను ద్వారా 11.87 లక్షల కోట్లు 19 శాతం. జీఎస్టీ ద్వారా 10.62 లక్షల కోట్లు 18 శాతం. కార్పొరేషన్​ పన్ను ద్వారా రూ. 10.20 లక్షల కోట్లు 17 శాతం. ఎక్సైజ్​ శాఖ ద్వారా రూ. 3.19 లక్షల కోట్లు 5 శాతం. కస్టమ్​ డ్యూటీ ద్వారా రూ. 2.38 లక్షల కోట్లు నాలుగు శాతం. ఇతర పన్నుల ద్వారా 0.14 లక్షల కోట్లు 0.2 శాతం. నాన్​ ట్యాక్స్​ రెవెన్యూ ద్వారా రూ. 2.19 లక్షల కోట్లు 3 శాతం. డివిడెండ్ల ద్వారా రూ. 3.27 లక్షల కోట్లు 5 శాతం. మొత్తం రాబడి 43.86 లక్షల కోట్లు 72 శాతం. 

రుణాలు ద్వారా సమీకరించే ఆదాయం..

బ్యాంకులు, విదేశాల ద్వారా సమీకరించే మొత్తం రూ. 16.13 లక్షల కోట్లు 27 శాతం. ప్రభుత్వ అస్సెట్స్​, వసూళ్ల ద్వారా ఆదాయం రూ. 0.78 లక్షల కోట్లు 1 శాతం. మొత్తం రూ. 16.91 లక్షల కోట్లు 28 శాతం. 

ఈ రెండింటి ద్వారా వచ్చిన మొత్తం 60.77 లక్షల కోట్లు వంద శాతం.

ఖర్చులు..

రాష్ర్టాలకు ఇచ్చేది రూ. 12.47 లక్షల కోట్లు 21 శాతం. రుణాల చెల్లింపులు రూ. 11.63 లక్షల కోట్లు 19 శాతం. కేంద్ర పథకాలకు రూ. 1‌0.88 లక్షల కోట్లు 18 శాతం. ఆర్థిక శాఖ బదలాయింపులు రూ. 5.24 లక్షల కోట్లు 9 శాతం. కేంద్రం రాష్ర్టాలకు ప్రత్యేక పథకాల ఖర్చు రూ. 5.06 లక్షల కోట్లు 8 శాతం. సబ్సిడీలు, రూ. 4.28 లక్షల కోట్లు 6 శాతం. ఇతర ఖర్చులు (రోజు వారీగా) రూ. 3.79 లక్షల కోట్లు 6 శాతం. పెన్షన్​ రూ. 2.43 లక్షల కోట్లు 4 శాతం. వేతనాలు రూ. 1.62 లక్షల కోట్లు 3 శాతం. ఇతర ఖర్చులు రూ. 3.28 లక్షల కోట్లు 5 శాతం. మొత్తం ఖర్చులు 60.77 లక్షల కోట్లు వంద శాతం. 

రాష్ట్రాల కేటాయింపులు..

రాష్ట్రాలకు వెళ్లే మొత్తం యూపీ రూ. 2.23 లక్షల కోట్లు, బిహార్​ రూ. 1.25 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్​ రూ. 98 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్​ రూ. 93 వేల కోట్లు, మహారాష్ర్ట రూ. 78 వేల కోట్లు, రాజస్థాన్​ రూ. 75వేల కోట్లు, ఒడిశా రూ. 56వేల కోట్లు, తమిళనాడు 50వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్​ రూ. 50వేల కోట్లు, కర్ణాటక రూ. 45 వేల కోట్లు, గుజరాత్​ రూ. 43వేల కోట్లు, చత్తీస్​ గఢ్​ రూ. 42వేల కోట్లు, ఝార్ఖండ్​ రూ. 41వేల కోట్లు, తెలంగాణ రూ. 26వేల కోట్లు, కేరళ రూ. 24వేల కోట్లు, పంజాబ్​ రూ. 22 వేల కోట్లు, ఉత్తరాఖండ్​ రూ. 14వేల కోట్లు, హరియాణా రూ. 13వేల కోట్లు, హిమాచల్​ ప్రదేశ్​ రూ. 10వేల కోట్లు, గోవా రూ. 5వేల కోట్లు, ఈశాన్య ప్రాంతాలు (అరుణాచల్​ ప్రదేశ్​, అసోం, మణిపూర్​, మేఘాలయ, మిజోరామ్​,నాగాలాండ్​, సిక్కిం, త్రిపుర) రూ. 1.07 లక్షల కోట్లు. అన్ని రాష్ర్టాలకు కలిపి రూ. 12.47 లక్షల కోట్లు.