ప్రధాని హెలికాప్టర్ లో సాంకేతిక లోపం
Technical fault in Prime Minister's helicopter
పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ డియోఘర్ ఎన్నికల ప్రచారం చేసుకొని బయలుదేరే సమయానికి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రధానమంత్రి గంటపాటు వేచి చూడక తప్పలేదు. జాముయ్ లో బహిరంగ సభలో పాల్గొన్న మోదీ తిరిగి ప్రయాణమయ్యేందుకు డియోఘర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు వివరించడంతో కాసేపు అక్కడే వేచి ఉన్నారు.