యోగి వ్యాఖ్యలు గడ్కరీ సమర్థన

Yogi's comments justify Gadkari

Nov 15, 2024 - 16:14
 0
యోగి వ్యాఖ్యలు గడ్కరీ సమర్థన

ఉగ్రవాదులు, శత్రువులను దృష్టిలో పెట్టుకునే వ్యాఖ్యలు
భారత్​ భిన్నత్వంలో ఏకత్వం..మనమంతా భారతీయులం

ముంబాయి: బటేంగే తో కటేంగే ను కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ సమర్థించారు. శుక్రవారం మహారాష్​ర్టలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​, మరికొంతమంది ఈ నినాదాన్ని ఇచ్చారని దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. విచ్ఛిన్ననకర శక్తులు అంటే ఉగ్రవాదులు, దేశ శత్రువులతో ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భారత్​ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమన్నారు. కొందరు దేవాలయం, మసీదు, చర్చిలకు వెళ్లినా అందరూ ఐక్యంగా ఉంటూ ఇటువంటి దుష్ఠశక్తులతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. పూజా విధానాలు వేరైనా మనమంతా భారతీయులమే అని స్పష్టం చేశారు. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాకూటమి నుంచి సీఎం పదవిపై గడ్కరీ మాట్లాడుతూ.. ఏకనాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల అనంతరం ఈ ముగ్గురు నేతలు, పార్టీ హైకమాండ్, ప్రజాప్రతినిధులు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.