సిసోడియా బెయిల్​ పిటిషన్​ సీబీఐ, ఈడీలకు హైకోర్టు నోటీసులు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్​ నేత మనీష్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ పై విచారణ

May 3, 2024 - 15:02
 0
సిసోడియా బెయిల్​ పిటిషన్​ సీబీఐ, ఈడీలకు హైకోర్టు నోటీసులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్​ నేత మనీష్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ పై విచారణ జరిపింది. మనీష్​ సిసోడియా తన భార్య అనారోగ్యం కారణంగా తనను చూసుకునేందుకు బెయిల్​ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ పిటిషన్​ ను హైకోర్టు విచారించింది. కింది కోర్టులో వేసిన పిటిషన్​ సందర్భంగా వారానికి ఒకరోజు బెయిల్​ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈడీ ఈయన అనుమతిని నిరాకరిస్తోంది. ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టు ఈడీని ప్రశ్నించింది. 

 బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఈ కేసును మే 8న విచారించనుంది. తన బెయిల్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలిసేందుకు అనుమతించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కొనసాగించాలని కోరుతూ సిసోడియా దరఖాస్తు చేశారు. ఈ విషయంపై ట్రయల్ కోర్టు ఉత్తర్వులు కొనసాగితే దర్యాప్తు సంస్థకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ పేర్కొంది.