కాలుష్య నివారణ చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం
Delhi Govt for pollution prevention measures
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో పెరుగుతున్న భారీ కాలుష్యం దృష్ట్యా ఆ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలకు దిగుతున్నా కాలుష్యం తగ్గడం లేదు. శుక్రవారం సీఎం అతిషి కాలుష్య నివారణకు మరో చర్యకు ఉపక్రమించారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు పనిచేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలపై కోర్టు ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడింది.