గ్లోబల్​ వార్మింగ్​ పై ప్రజలకు వివరించాలి

భారత్​ ను మెరుగైన సమాజంగా తీర్చిదిద్దడంలో మీ వంతు పాత్ర పోషించాలి కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో రాష్ర్టపతి అధ్యక్షురాలిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపదీ ముర్మూ

Jul 25, 2024 - 16:31
 0
గ్లోబల్​ వార్మింగ్​ పై ప్రజలకు వివరించాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వాతావరణ మార్పులు,గ్లోబల్​ వార్మింగ్​ పై ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం విద్యార్థులపై ఉందని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. రాష్ర్టపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ర్టపతి ఎస్టేట్​ లోని డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​ కేంద్రీయ విద్యాలయాన్ని ముర్మూ గురువారం సందర్శించారు. 9వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ఆధునిక ప్రపంచంలో తలెత్తుతున్న  సమస్యలపై వారితో చర్చించారు. వస్తువులను రీ సైకిల్​ చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందని విద్యార్థులకు తెలిపారు. భారత్​ ను ప్రపంచదేశాల్లో మెరుగైన సమాజంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులే భావిభారత పౌరులన్న విషయాన్ని గుర్తెరగాలని రాష్ర్టపతి అన్నారు.