ఉపాధి కల్పన పథకాలను సద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నా తెలంగాణ, నిర్మల్: కేంద్ర ప్రభుత్వ ఉపాధి పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ లో ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం కింద బ్రాయిలర్ కోళ్ల ఫామ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని, గరిష్టంగా రూ.20 లక్షల సబ్సిడీ పొందవచ్చని అన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన కోళ్ల ఫారానికి రూ.20 లక్షల రుణం మంజూరు చేయబడిందని అన్నారు. ఇలాగే అర్హులైన వారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ గోపాల్, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ నర్సింహారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.