విజయానికి చిహ్నం దసరా

మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు

Oct 11, 2024 - 19:38
 0
విజయానికి చిహ్నం దసరా

మా తెలంగాణ, మెదక్: దసరా పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా ప్రజలకు, బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. ఐక్యతకు ప్రతీకగా ఈ దసరా నిలుస్తుందన్నారు. 

శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని అన్నారు. మెదక్ జిల్లాకు, ప్రజలకు మేలు కలిగేలా అమ్మవారి కృపా, కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని పద్మా దేవేందర్​ రెడ్డి ప్రార్థించారు.