ఝార్ఖండ్ తొలివిడతకు అన్ని ఏర్పాట్లు పూర్తి
All arrangements are complete for the first phase of Jharkhand
సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా సిబ్బంది తరలింపు
రెండు వందల కంపెనీల పారామిలటరీ బలగాల మోహరింపు
రాంచీ: ఝార్ఖండ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం తొలి విడత ఎన్నికలు 43 స్థానాల్లో జరగనున్నాయి. మంగళవారం మధ్యాహ్నాం వరకు పోలింగ్ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. ఝార్ఖండ్ వ్యాప్తంగా 225 సున్నిత ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భారత వాయుసేన సహకారంతో హెలికాప్టర్ల ద్వారా 194 పోలింగ్ బృందాలను తరలించారు. రాష్ర్ట వ్యాప్తంగా 15,344 పోలింగ్ కేంద్రాలు, రెండు వందల కంపెనీల పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ సింగ్‌భూమ్, లతేహర్, లోహర్‌దగా, గర్వా, గుమ్లా ఐదు జిల్లాల్లోని కొన్ని పోలింగ్ బూత్ లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఝార్ఖండ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ర్ట వ్యాప్తంగా 73 మంది మహిళలతో సహా 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి రాజకీయ భవిష్యత్ ను 1.37 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. తొలివిడతలో 43, రెండో విడత 20న 38 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.