అనుమానాల నివృత్తి పిటిషన్
అత్యవసరంగా విచారించలేం రెండు వారాల తరువాత విచారణ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: ఈవీఎంలపై అనుమానాల నివృత్తి, ఓట్లతోపాటు వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా కౌంటింగ్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఎన్నికలు సజావుగా కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. పిటిషన్ను వెంటనే విచారించాల్సిన అవసరం ఉందని సీనియర్ న్యాయవాది కపిల్సిబల్న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు కోర్టు సమాధానం ఇస్తూ తాము విచారణ చేపట్టేందుకుసిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యపడదని తెలిపింది. రెండు వారాల తరువాత విచారణ చేపడతామని, ఈ అంశంపై అందరికి తగినంత సమయం ఇచ్చి వారి వారి వాదనలు వింటామని జస్టీస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని అత్యవసరం ఈ పిటిషన్ను విచారించలేమని స్పష్టం చేసింది.