కాంగ్రెస్ విభజించు, పాలించు
Divide and rule Congress
బీజేపీ ఐక్యత, అభివద్ధే విధానాలు
కేంద్రమంత్రి, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో విజయం తథ్యం
హరియాణా, జమ్మూ ఎన్నికలపై ప్రతిపక్షాల అంతర్మథనం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ వి విభజించు పాలించు నినాదాలైతే, బీజేపీవి ఐక్యత, అభివృద్ధే ప్రధాన విధానాలని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం ఖాయమని కేంద్రమంత్రి, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నడ్డా మీడియాతో మాట్లాడారు. హరియాణా, జమ్మూకశ్మీర్ లో ఎన్నికల తరువాత మహారాష్ర్ట, ఝార్ఖండ్ ఎన్నికలపైనే తమ దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. మరికొద్ది నెలల్లో ఈ రెండు రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు.
హరియాణాలో భారీ విజయం, జమ్మూకశ్మీర్ లో భారీగా పుంజుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో బీజేపీ పెద్దయెత్తున సీట్లను గెలవడంపై కాంగ్రెస్, జేకేఎన్సీలు అంతర్మథనంలో పడ్డాయన్నారు. జమ్మూకశ్మీర్ లో గ్రౌండ్ రియాల్టీ వేరే విధంగానే ఉందని బీజేపీ ఓట్ల శాతం బాగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదం, హింస అదుపులో ఉన్నాయని, ఆర్టికల్ 370పై యూటర్న్ తీసుకుంటే మళ్లీ ఆ ప్రాంతంలో అలజడులు రేగే ఆస్కారం ఉందన్నారు. హిమాచల్ లో బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు. గంటల తరబడి నీటి కోసం ఎదురు చూసిన ప్రజలు నేడు ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించడాన్ని హర్షిస్తున్నారని తెలిపారు.