స్వాతిమాలివాల్ పై దాడి కేసు.. విభవ్ కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
Swatimaliwal assault case.. Vibhav three days police custody
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతిమాలివాల్ కేసులో విభవ్ కుమర్ ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. మంగళవారం ఈ కేసుపై విచారణ కొనసాగింది. కేసును విచారించిన అనంతరం నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాదనలు,ప్రతివాదనలు జరిగాయి.
విభవ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. విభవ్ తనకు తాను వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యాలను సృష్టించుకుంటాడన్నారు. పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారన్నారు.
పోలీసుల తరఫున న్యాయవాది వాదిస్తూ ఫోన్ ను ఫార్మెట్ చేసినట్లు విభవ్ ఒప్పుకున్నాడన్నారు. ఘటనను పూర్తిగా వీడియో తీశాడా? లేదా? అన్నది నిర్ధరించాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విభవ్ ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం వెలువరించింది.