ఆరోదశలో 63.37 శాతం పోలింగ్
11.13 కోట్ల మందిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 7.05 కోట్లమంది ఆరుదశల్లో 87.54 కోట్ల మందికి గాను 57.77 కోట్ల మంది ఓట్లేశారు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో ఆరో విడతలో జరిగిన పోలింగ్ శాతాన్ని ఈసీ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆరో విడతలో 63.37 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 11.13 కోట్లు ఉండగా, 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. ఆరుదశల్లో పోలింగ్ 87.54 కోట్ల మంది ఓటర్లుండగా, 57.77 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొదటి దశలో 102 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 16.64 కోట్ల మంది ఓటర్లుండగా, 11 కోట్ల మంది 66.14 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో దశలో 88 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 15.86 కోట్ల మంది ఓటర్లుండగా, 10.58 కోట్ల మంది 66.71 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడోదశ 94 స్థానాలుండగా 17.24 కోట్ల మంది ఓటర్లుండగా 11.32 కోట్ల మంది 65.68 శాతం మంది, నాలుగో దశలో 96 స్థానాలకు గానూ 17.71 కోట్ల మంది ఓటర్లుండగా 12.25 కోట్ల మంది 66.71 శాతం, ఐదో దశలో 49 స్థానాల్లో 8.96 కోట్ల మంది ఓటర్లుండగా 5.57 కోట్ల మంది 62.20 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఆరో దశలో 58 స్థానాలకు గాను పోలింగ్ కొనసాగగా 7.05 కోట్ల మంది 63.37 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఈసీ వెబ్ సైట్ లో పొందుపరిచింది.