కాలుష్యంతో రోజుకు 5700 మరణాలు!
5700 deaths per day due to pollution!
యేటా ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మరణాలు
భారత్ లో యేటా 21 లక్షల మరణాలు
పీఎం 2.5 మైక్రాన్ల కణాలు నేరుగా ఉపిరితిత్తుల్లోకి
వెంట్రుక కంటే వందరెట్లు సన్నవి
దక్షిణాసియా, ఆఫ్రికాలో అత్యధిక మరణాలు
స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024లో విస్తుగొలిపే విషయాలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ లో ప్రతిరోజూ 5700 మరణాలు కేవలం కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024లో నివేదిక వెల్లడించింది. యేటా ప్రపంచవ్యాప్తంగా 81లక్షల మరణాలు సంభవిస్తుండగా, భారత్ లో 21 లక్షల మరణాలు కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయని నిఏవదికలు స్పష్టం చేసింది. ప్రపంచంలో ప్రతి ఎనిమిది మరణాలలో ఒకటి వాయు కాలుష్యం వల్లే సంభిస్తుందని పేర్కొంది. పొగాకు కంటే వాయుకాలుష్యమే ప్రమాదకరంగా మారిందని తెలిపింది. ప్రపంచంలో 12 శాతం మరణాలకు విషపూరితమైన గాలి కారణంగా నివేదికలో పేర్కొంది. కాలుష్యం వల్ల అధిక రక్తపోటు కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది.
ఢిల్లీలో ఎక్యూఐ 500 దాటడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆరోగ్యంతో ఉన్న వారు కూడా అనారోగ్యానికి గురవుతారని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు.
ఢిల్లీలో అత్యధిక కాలుష్యం పంజాబ్, హరియాణా, చండీగఢ్, యూపీలలో ఎండిన పంటలను కాల్చడం ద్వారా 37 శాతం కాలుష్యం ఢిల్లీకి చేరుతుందని వాతావరణశాఖ గుర్తించింది. మరోవైపు పరిశ్రమల ద్వారా 30 శాతం కాలుష్యం వెలువడుతుండగా, మరో 40 శాతం కాలుష్యం వాహనాల ద్వారా ఉత్పత్తి అవుతుందని నిపుణులు గుర్తించారు. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుంది.
పీఎం 2.5 మైక్రాన్ల కణాలు కాలుష్యం ద్వారా నేరుగా మనిషి ఉపిరితిత్తుల్లోకి చేరతాయి. ఇవి అత్యంత ప్రమాదకరం. ఈ కణాలు మనిషి వెంట్రుక కంటే వందరెట్లు సన్నగా ఉంటాయి. ఇవి నోరు, ముక్కు ఇతర భాగాల ద్వారా మానవ శరీరంలోకి చేరి తిష్టవేసి మనిషిని అనారోగ్యానికి గురి చేస్తాయి.
స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2024లో మరణాలకు రెండో అతిపెద్ద కారణం విషపూరితమైన గాలి అని నిర్దరించారు. దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలు ఎక్కువగా కాలుష్య కోరల్లో ఉన్నట్లు గుర్తించారు. 81 లక్షల మరణాల్లో 58 శాతం పర్యావరణ కాలుష్యం కారణంగానే సంభవించాయని నివేదిక స్పష్టం చేసింది.
ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు వాయుకాలుష్యం రెండో అతిపెద్ద కారణం కావడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి చిన్న పిల్లల మరణాలకు ఇదే అతి పెద్ద కారణం. కాగా, వాయు కాలుష్యం కారణంగా 2021లో ఐదేళ్లలోపు చిన్నారులు 7 లక్షలకు పైగా మరణించారు. ఇది మాత్రమే కాదు, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలలో పుట్టిన మొదటి నెలలో 30 శాతానికి పైగా మరణాలకు కూడా విషపూరిత గాలి కారణమని ఈ సంస్థ చెబుతుంది.