స్టాక్ హోమ్: రసాయన శాస్ర్తంలో ముగ్గురు శాస్ర్తవేత్తలకు నోబెల్ పురస్కారం వరించింది. బుధవారం రాయల్ స్వీడీష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ 2024 స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో నోబెల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ బహుమతులను ప్రకటించారు. డేవిడ్ బేకర్ (అమెరికా) నూతన ప్రోటీన్ ను సృష్టించాడు. ప్రోటీన్ల నిర్మాణాల్లో ఏఐ మోడల్ ను రూపొందించినందుకు గాను జాన్ జంపర్ (అమెరికా), డెమిస్ హస్సాబిస్ (బ్రిటన్) శాస్ర్తవేత్తలకు నోబెల్ బహుమతులను ప్రకటించింది.
ప్రోటీన్ డిజైన్ అనేది నూతన ప్రోటీన్ల నిర్మాణంలో కీలకంగా మారనుంది. సాంకేతికత ద్వారా టీకాల తయారీలో సహాయపడుతుంది. 2024 నోబెల్ బహుమతులను అక్టోబర్ 7 నుంచి ప్రకటిస్తున్నారు. తొలి రోజు వైద్య శాస్ర్తంలో ఇద్దరికీ, రెండో రోజు భౌతిక శాస్ర్తంలో ఇద్దరికి, మూడో రోజు ముగ్గురికి నోబెల్ ప్రకటించింది.