మూడేళ్లుగా ట్రూడోకే సమాచారం!
గురు పత్వంత్ సింగ్ పన్నూ ఖలిస్థానీ ప్రచారాన్ని ఆపేది లేదు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు కెనడాకు పూర్తి సమాచారం అందిస్తున్నది తానేనని ఖలిస్థాఈ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ అంగీకరించాడు. భారత్–కెనడల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం పన్నూ స్పందించారు. తాను గత మూడేళ్లుగా నేరుగా ట్రూడోతోనే సంప్రదింపులు జరుపుతున్నానని పేర్కొన్నారు. భారత వ్యతిరేక సమాచారాన్ని అందించింది కూడా తానేనని చెప్పుకున్నాడు. తాను అందించిన సమాచారం మేరకే ట్రూడో చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశాడు. ఖలిస్థానీ ప్రచారాన్ని ఆపేది లేదన్నాడు.
పన్నూ స్పందనతో కెనడా ప్రధానమంత్రి ట్రూడో మూడేళ్లుగా ఖలిస్థానీ గ్రూపుతో సంబంధాలను కలిగి ఉన్నాడనే అంశం స్పష్టం అవుతోంది. సహజంగాన ఈ గ్రూపు భారత్ లో టెర్రర్ గ్రూప్ గా ముద్రపడింది. భారత్ పలుమార్లు టెర్రర్ గ్రూప్ పై సమాచారం కెనడా ప్రభుత్వంతో పంచుకున్నా పెడచెవిన పెట్టారు. ఎన్నికలు సమీపిస్తుండగా ఈ అంశాన్ని లేవనెత్తి సిక్కు ఓట్ల రాజకీయానికి ట్రూడో తెరలేపారన్నది స్పష్టం అవుతుంది.
ఏది ఏమైనా ఉగ్ర నాయకునితో నేరుగా ప్రధాని మూడేళ్లుగా సంప్రదింపుల్లో ఉండడం విశేషం.