స్టేట్ మెంట్ ఇచ్చేందుకు కోర్టుకు స్వాతి మాలివాల్
కేజ్రీ వాల్ సభలో గాజులతో బీజేపీ, మహిళా నేతల ఆందోళన బిభవ్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు సీఎం హస్తం ఉంటే? ఆయనపై చర్యలు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతి మాలివాల్ పై దాడి కేసులో శుక్రవారం ఆమె తన స్టేట్ మెంట్ ను ఇచ్చేందుకు తీస్ హజారీ కోర్టుకు హాజరయ్యారు. గురువారం నాలుగైదు గంటలపాటు పోలీసులు విచారణ అనంతరం ఆమెను వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మాలివాల్ స్టేట్ మెంట్ ను కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద రికార్డ్ చేయనుంది. మరోవైపు కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు శుక్రవారం సాయంత్రం లోగా సీఎం ఇంటికి వెళ్లి అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పూర్తిగా పరిశీలించి కోర్టుకు, మహిలా కమిషన్ కు సమర్పించనున్నారు.
కాగా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ సభ నిర్వహిస్తున్న ప్రాంతానికి మహిళా నాయకురాళ్లు చేరుకొని గాజులు చూపెడుతూ నిరసన తెలిపారు. ఎంపీ, రాజ్యసభ సభ్యురాలిపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. పెద్ద యెత్తున ఆందోలన చేపట్టారు. ఈ ఆందోళనలు బీజేపీ మహిళా నేతలతోపాటు ఆయా పార్టీలకు చెందిన మహిళలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం.
ఇంకోవైపు సీఎం పీఏ బిభవ్ ఆచూకీ కోసం పోలీసుల వేట తీవ్రతరమైంది. ఈ కేసును మొత్తం పది బృందాలు విచారిస్తుండగా, అందులోని నాలుగు బృందాలు బిభవ్ కోసం ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం హాజరు కావాలని మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం వరకు అతను కమిషన్ ముందు హాజరు కాకపోవడం మరోమారు నోటీసులు జారీ చేయనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ చెప్పారు. దాడి ఘటనలో సీఎం హస్తం ఉన్నట్లు తేలిన ఆయనపై కూడా చట్టరీత్యా చర్యలుంటాయని రేఖా శర్మ స్పష్టం చేశారు.
స్వాతిమాలివాల్ పై 13న జరిగిన దాడి ఘటనలో పోలీసులు 354 (అత్యాచారం), 323 (దాడి), 506 (హత్య చేస్తామని బెదిరింపు), 509 (అసభ్యకర వ్యాఖ్యలు చేయడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.