మాలివాల్​ పై దాడి పీఏను వెంటేసుకొని తిరుగుతారా?

మహిళా లోకానికి సీఎం క్షమాపణలు చెప్పాల్సిందే దాడిపై అనేక అనుమానాలు సమగ్ర విచారణ జరగాల్సిందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

May 17, 2024 - 13:23
 0
మాలివాల్​ పై దాడి పీఏను వెంటేసుకొని తిరుగుతారా?

నా తెలంగాణ,  న్యూ ఢిల్లీ: సొంతపార్టీ మహిళా నాయకురాలిపై దాడి చేస్తుంటే మీనమేషాలు లెక్కించింది గాక, పీఏ బిభవ్​ ను వెంటేసుకు తిరుగుతారా? అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ధ్వజమెత్తారు. శుక్రవారం స్వాతి మాలివాల్​ పై దాడి విషయంపై స్పందించారు. వెంటనే కేజ్రీవాల్​ బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని సీతారామన్​ డిమాండ్​ చేశారు.

పరిస్థితులు ఇంత సీరియస్​ గా ఉంటే పీఏను వెంటేసుకొని ఎన్నికల ప్రచారానికి తిరగడం సీఎంకు మహిళలపై ఉన్న గౌరవం ఏంటో తెలియజేస్తుందని మండిపడ్డారు. కేజ్రీవాల్​ మౌనం వెనుక దాడి నిజమేననే అనుమానాలు ఉన్నాయన్నారు. సీఎం హస్తం కూడా ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మహిళా ఎంపీ, రాజ్యసభ సభ్యురాలిపై దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులెంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.